News February 16, 2025

అనకాపల్లి: మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో మెరిసిన నేవీ ఉద్యోగి

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లిలోని శంభు వానిపాలానికి చెందిన నేవీ ఉద్యోగి అప్పన్న దొర జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటారు. రాజస్థాన్‌లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో 45 ఏళ్ల విభాగంలో 4×400 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకాన్ని, 4×100 200 మీటర్ల పరుగు పందెంలో వెండి పతకం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్ కాంస్య పతకం పొందారు. ఆదివారం ఆయనను గ్రామస్థులు సత్కరించారు.

Similar News

News November 23, 2025

ములుగు: నేడు సర్పంచ్ రిజర్వేషన్ జాబితా విడుదల..!

image

సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ప్రక్రియ రాత్రి వరకు జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో 10 మండలాల్లోని 146 గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లను అధికారులు నిర్ణయించారు. అనంతరం నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. నేడు తుది జాబితాను కలెక్టర్ అధికారికంగా విడుదల చేయనున్నారు. అనంతరం ఇదే జాబితాను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

News November 23, 2025

GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/1)

image

నిర్మాణ రంగం ఊపందుకుంటున్న విశాఖలోని GVMC <<18365028>>టౌన్ ప్లానింగ్<<>> విభాగంపై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని అన్ని జోన్లలో దాదాపు పరిస్థితి ఒకేలా ఉంది. అనుమతులు, కంపౌండ్ వాళ్లు, ప్లాన్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు.. ఏ పనైనా “ధనం ఉంటే వెంటనే-లేకపోతే నెలల తరబడి లేటు” అన్న విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా, నిబంధనలు పట్టించుకోకుండానే కొన్ని భవనాలకు అనుమతులు ఇస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.

News November 23, 2025

GVMCలో అవినీతి ‘ప్లానింగ్’..!(1/2)

image

త్వరలో 10జోన్లుగా రూపాంతరం చెందనున్న GVMCలో(ప్రస్తుతం 8) భవన నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలకు ఆన్‌లైన్‌లో <<18364917>>అనుమతులు<<>> ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అనుమతున్నీ ఉన్నా అదనంగా కొర్రీలు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలొస్తున్నాయి. ఒక భవనానికి అనుమతి కావాలంటే రూ.లక్షల్లో ముడుపులు అడుగుతున్నట్లు నిర్మాణదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు నిఘా పెట్టాలన్న డిమాండ్‌లు వినిపిస్తున్నాయి.