News January 29, 2025

అనకాపల్లి: మేమంతా సేఫ్

image

కుంభమేళాలో తొక్కిసలాట జరగ్గా పలువురు గాయపడ్డారు. అనకాపల్లిలోని పలు గ్రామాల నుంచి గుంపులుగా కుంభమేళాకు వెళ్లారు. తొక్కిసలాట ఘటనతో మేళాకు వెళ్లిన వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మేడివాడకు చెందిన పలువురు ప్రయాగ్‌రాజ్‌లో ఫొటో దిగి తామంతా సేఫ్‌గా ఉన్నామంటూ ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మీ ప్రాంతం నుంచి కుంభమేళాకు వెళ్లిన వారు క్షేమంగా ఉన్నారా.. వారి పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News October 18, 2025

MBNR: బీసీ బిల్లును అమలు చేయాలి

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర శనివారం బీసీ ఉమ్మడి జిల్లా జేఏసీ ఛైర్మన్ బెక్కం జనార్దన్, వివిధ సంఘాల నాయకులు బీసీ బంద్‌ను నిర్వహించారు. జేఏసీ ఛైర్మన్ మాట్లాడుతూ.. బీసీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకొచ్చి 42% బీసీ బిల్లు అమలు చేస్తూ, తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జలజం రమేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, రామ్మోహన్ జి పాల్గొన్నారు.

News October 18, 2025

మహబూబ్‌నగర్‌లో బీసీ జేఏసీ బంద్

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్ కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నేతలు మాట్లాడుతూ.. బీసీ హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

News October 18, 2025

NTR: 30 ఇయర్స్ ఇండస్ట్రీ.. రూ.100కోట్లు కాజేశాడు..! (1/2)

image

విజయవాడ పన్నుల శాఖ-2 డివిజన్‌ అటెండర్ కొండపల్లి శ్రీనివాస్ లంచం డిమాండ్ చేస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 30 ఏళ్లుగా వసూళ్ల దందా చేస్తున్న శ్రీనివాస్, సీటీఓ అధికారుల కంటే ముందే సరుకు లారీల సమాచారం సేకరించి వ్యాపారులను బెదిరించేవాడు. ఈ అవినీతి తిమింగలం రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు కూడగట్టినట్టు అధికారులు గుసగుసలాడుతున్నారు. ఈ భారీ అవినీతిపై ఏసీబీ తదుపరి చర్యలు ఎలా ఉంటాయో చూడాలి.