News April 24, 2025

అనకాపల్లి: మే 19 నుంచి ఓపెన్ స్కూల్ సప్లమెంటరీ పరీక్షలు

image

అనకాపల్లి జిల్లాలో ఓపెన్ స్కూల్‌కు సంబంధించి సెకండరీ బోర్డు, 10వ తరగతి పరీక్షలు మే 19 నుంచి నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు తెలిపారు. మే 28వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ నెల 24 నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. అధికారిక వెబ్‌సైట్‌లో హెచ్.ఎం లాగిన్ నుంచి ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.

Similar News

News April 24, 2025

చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించిన పవన్ కళ్యాణ్

image

కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మరణించిన చంద్రమౌళి కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురువారం పరామర్శించారు. చంద్రమౌళి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగ్ర దాడుల్లో సామాన్య ప్రజలు మరణించడం తన మనసును కలిచివేసిందని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆ కుటుంబాని పవన్ హామీ ఇచ్చారు.

News April 24, 2025

అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

image

➤ 590 ప్లస్ మార్కులు సాధించిన 9 మంది విద్యార్థులకు కలెక్టర్ అభినందన➤ మాడుగుల మోదకొండమ్మను దర్శించుకున్న జాయింట్ కలెక్టర్➤ ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ➤ ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు ఉంటే తెలపాలి:DRO➤ విశాల్ మార్ట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని CITU ధర్నా➤ వడ్డాదిలో అగ్నిప్రమాదం➤ పది ఫలితాల్లో ప్రథమ స్థానంలో కోటవురట్ల మండలం➤ ఉగ్రదాడికి నిరసనగా క్యాండిల్ ర్యాలీలు

News April 24, 2025

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్

image

బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ ఎదుట గతంలో ఆయన కుమరుడు యాక్సిడెంట్ చేయగా.. పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనారోగ్య కారణాలతో షకీల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కుమారుడుని తప్పించి, మరొకరిని లొంగిపోయేలా చేశాడు. షకీల్‌కు సహకరించిన పోలీసులపై వేటుపడగా, కొడుకుతో కలిసి దుబాయ్‌కి వెళ్ళాడు. ఇటీవల తిరిగి వచ్చాడు.

error: Content is protected !!