News February 6, 2025
అనకాపల్లి: మొన్న మూడు.. నిన్న నిల్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738807783587_697-normal-WIFI.webp)
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు మంగళవారం మూడు నామినేషన్లు దాఖలవగా నిన్న బుధవారం ఒక్కటి కూడా కాలేదు. టీఎన్ఎప్ఎఫ్ మద్దతో పోటీలో ఉన్న సిటింగ్ MLC రఘువర్మ మొన్న నామినేషన్ వేశారు(ఈయనకు కూటమి మద్దతు ఇచ్చినట్లు సమాచారం). యూటీఎఫ్ ప్రజా సంఘాల మద్దతుతో పోటీ చేస్తున్న విజయగౌరి నేడు విశాఖలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. మాజీ MLC గాదె శ్రీనివాసులునాయుడుకు పీఆర్టీయూ మద్దతు తెలిపింది.
Similar News
News February 6, 2025
మూడు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’: చంద్రబాబు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738463408246_893-normal-WIFI.webp)
AP: పీఎం కిసాన్ పేరిట కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.14 వేలు కలిపి ‘అన్నదాత సుఖీభవ’ అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. రాబోయే మూడు నెలల్లో ప్రజలకు అందాల్సిన పథకాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు.
News February 6, 2025
‘కోడుమూరు మాజీ MLAపై చీటింగ్ కేసు పెడతాం’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738837491993_934-normal-WIFI.webp)
కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణపై చీటింగ్ కేసు నమోదు చేయాలని అదే పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నిధులను మురళీకృష్ణ దారి మళ్లించే ప్రయత్నం చేశారు. కార్యకర్తలు, నేతల కళ్లుగప్పి ఆయన తన సొంత సొసైటీ ఏర్పాటు చేసి నిధులు కాజేయాలని చూశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం’ అని లక్ష్మీ నరసింహ చెప్పారు.
News February 6, 2025
సంగారెడ్డి: ALERT.. 9న చివరి గడువు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738836454508_52141451-normal-WIFI.webp)
బీసీ స్టడీ సర్కిల్లో ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ, బ్యాంకింగ్ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జగదీష్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను www.bcstudycircle.comలో ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఎంపికైన వారికి ఈనెల 15 నుంచి 100 రోజులపాటు తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు.