News February 5, 2025

అనకాపల్లి: మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా

image

అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 5వ తేదీ ఉదయం 11 గంటలకు మొబైల్ ఫోన్‌ల రికవరీ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా పోలీస్ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. సుమారు రూ.కోటి విలువైన మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేస్తామని తెలియజేసింది. 9వ విడత రికవరీ మేళా నిర్వహిస్తున్నామని వివరించింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా చేతుల మీదుగా మొబైల్ ఫోన్లు అందజేస్తారని తెలిపింది.

Similar News

News March 13, 2026

40ల్లో ఈ తప్పులు చేయకండి!

image

రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలంటే 40-50ఏళ్ల మధ్య తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఆ ఏజ్‌లో జాబ్ మారేటప్పుడు PF విత్‌డ్రా చేయొద్దని, తొందరపడి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు కొనొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ద్రవ్యోల్బణం ప్రభావం లేని అసెట్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని, మల్టిపుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. ఏటా మీ పోర్ట్‌ఫోలియో చెక్ చేసుకొని సవరించుకోవాలని చెబుతున్నారు.

News March 13, 2026

NLG: అక్రమ గ్యాస్ వినియోగంపై ఉక్కుపాదం

image

జిల్లాలో డొమెస్టిక్(వంట గ్యాస్) సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి.వెంకటేష్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం నల్గొండతో పాటు మల్లేపల్లి గ్రామాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు.

News March 13, 2026

చెరువుగట్టు రామలింగేశ్వరుడికి భారీ ఆదాయం

image

చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం నిర్వహించిన వివిధ వేలం పాటలు గుడికి రికార్డు స్థాయి ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. మొత్తం ఐదు విభాగాల్లో నిర్వహించిన ఈ టెండర్ల ద్వారా దేవస్థానానికి రూ.50,22,887 ఆదాయం సమకూరినట్లు EO సల్వాది మోహన్ బాబు తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈసారి వేలం పాటల్లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. ఈ ఏడాది రూ.13 లక్షలకుపైగా అదనపు ఆదాయం లభించింది.