News July 28, 2024
అనకాపల్లి: యువతి కిడ్నాప్.. ఐదుగురు అరెస్ట్
యువతిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడితో సహా అతని స్నేహితులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు అనకాపల్లి టౌన్ సీఐ శంకర్ రావు తెలిపారు. 19 ఏళ్ల యువతి స్నేహితుడితో కలిసి సింహాచలం వెళ్లి వస్తుండగా తేజసాయికుమార్ అనే యువకుడు వారిని అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. మనస్తాపానికి గురైన యువతి ఏలేరు కాలవలోకి దూకారు. కాపాడిన తేజ సాయికుమార్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
Similar News
News October 14, 2024
విశాఖ: త్వరలో తెలుగులో వాతావరణం సమాచారం
వాతావరణ సమాచారాన్ని త్వరలో తెలుగులో అందించనున్నట్లు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం చీఫ్ భారతి తెలిపారు. త్వరలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇంగ్లీష్ భాషలోనే వాతావరణం సమాచారాన్ని అందిస్తున్నామన్నారు. ఇకపై ఐఎండీ సూచనలకు అనుగుణంగా ప్రాంతీయ భాష తెలుగులో సమాచారాన్ని అందజేస్తామన్నారు. కైలాసగిరిపై ఏర్పాటుచేసిన డాప్లర్ రాడార్ ఆధునీకరణ పనులను త్వరలో ప్రారంభిస్తామన్నారు.
News October 14, 2024
విశాఖలో రూ.13 కోట్ల మద్యం విక్రయాలు
విజయదశమి సందర్భంగా ఆదివారం ఒక్కరోజు విశాఖ జిల్లాలో రూ.13 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. జిల్లాలో 139 ప్రభుత్వం మద్యం దుకాణాలతో పాటు 132 బార్‌లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు స్వల్పంగానే పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం దుకాణాల్లో తగినంత స్టాక్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
News October 14, 2024
విశాఖ: 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు
విశాఖ జిల్లాలో 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 14 ఉదయం 8 గంటల నుంచి వుడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం షాపుల కేటాయింపుకు జరిగే లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులు అధికంగా రావడంతో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా ఎక్కువ కౌంటర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.