News March 30, 2025
అనకాపల్లి: రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటా- ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో ముస్లింల రక్షణ కోసం 24 గంటలు నిమగ్నమై ఉంటానని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. శనివారం అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమతాల సారం ఒక్కటేనని, ఉపవాస దీక్షలు, ఆరాధన ప్రార్థనలు మనుషుల్లో ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి సద్గుణాలను పెంపొందిస్తాయన్నారు.
Similar News
News October 22, 2025
NLG: మద్యం దుకాణాలకు 4,629 దరఖాస్తులు

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు మంగళవారం మరో 9 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 4,629 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.
News October 22, 2025
ఖమ్మం: 200 ఉద్యోగాలు.. రేపే అవకాశం

ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకుల కోసం అక్టోబర్ 23న ఉదయం 10 గంటలకు టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐలో జె.వి.జి మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. హైదరాబాద్లోని ఏరో స్పేస్, ఎలివేటర్స్ తయారీ యూనిట్లలో దాదాపు 200 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంటర్, డిగ్రీ అర్హత గల 19-23 ఏళ్ల యువతీ యువకులు హాజరుకావాలని సూచించారు.
News October 22, 2025
భీమవరం DSP పై పవన్ సీరియస్.. హోం మంత్రి స్పందన

భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ నివేదికను కోరిన విషయం తెలిసిందే. దానిపై హోంమంత్రి అనిత స్పందించారు. డిప్యూటీ సీఎంగా పవన్ డీజీపీని నివేదిక అడగడంలో ఎలాంటి తప్పులేదని, తనకు వచ్చిన సమాచారాన్ని పవన్ వెల్లడించడంలో తప్పేముందని ప్రశ్నించారు. కాగా డీఎస్పీ పరిధిలో పేకాట స్థావరాలు పెరగడం, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఫిర్యాదులు అందాయని పవన్ అన్నారు.