News August 9, 2024
అనకాపల్లి: రన్నింగ్ RTC బస్సులోకి పాము
మాకవరపాలెం నుంచి నర్సీపట్నం వెళ్తున్న RTC బస్సులోకి నాగు పాము ప్రవేశించడంతో ప్రయాణీకులు భయాందోళన చెందారు. బస్సు బయలుదేరిన కాసేపటికే మాకవరపాలెం సమీపంలో వేరే వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో తుప్పల్లో ఉన్న పాము బస్సులోకి ప్రవేశించింది. అది గమనించిన ప్రయాణీకులు భయాందోళన చెందడంతో వారిని వేరే బస్సులో తరలించినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. భయాందోళనతో ఓ ప్రయాణీకుడు ఆ పామును కొట్టినట్లు తెలుస్తోంది.
Similar News
News September 13, 2024
వరద బాధితుల కోసం విశాఖ పోర్టు రూ.కోటి విరాళం
విజయవాడల వరద ప్రభావిత ప్రాంత ప్రజల సహాయార్థం విశాఖపట్నం పోర్టు అథారిటీ రూ.కోటి విరాళం ఇచ్చింది. పోర్ట్ కార్యదర్శి టి.వేణు గోపాల్, వివిధ విభాగాధిపతులు విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ ఎం.ఎన్.హరేంద్ర ప్రసాద్‌కు సంబంధిత నగదు చెక్‌ను అందజేశారు. కార్మిక సంఘాలు, ఉద్యోగులు తమ వంతు సహకారం అందజేశారని యాజమాన్యం తెలిపింది.
News September 13, 2024
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో డిజిటలైజేషన్ ప్రక్రియ
ఏయూలో 23 లక్షల ధ్రువపత్రాలను 1996 నుంచి డిజిటలైజేషన్ చేస్తామని ఏయూ వీసీ శశిభూషణరావు తెలిపారు. ఇందులో మార్కుల జాబితాలు, ఓడీలు ఉంటాయన్నారు. 2023 నుంచి ఏయూలో చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లను అకాడమీ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ)లో ఉంచుతామన్నారు. ఏబీసీకి సంబంధించి ప్రతి విద్యార్థికి ఒక కోడ్ ఉంటుందన్నారు. డిజిటలైజేషన్ ప్రక్రియను ఒక సంస్థకు అప్పగిస్తామన్నారు.
News September 12, 2024
అన్ని ఆసుపత్రులకు అనుమతి తప్పనిసరి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
జిల్లాలోని అన్ని ఆసుపత్రులకు తప్పనిసరిగా అనుమతులు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జగదీశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, నర్సింగ్ హోమ్‌లు కచ్చితంగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.