News February 6, 2025

అనకాపల్లి: రాత్రంతా ఆందోళన 

image

అధిక లోడుతో వస్తున్న లారీలను నివారించాలని శెట్టిపాలెం, భీమబోయినపాలెం, జెడ్ గంగవరం సర్పంచులు రాత్రంతా ఆందోళన కొనసాగించారు. అల్లు రామనాయుడు, నందకిషోర్, రమణ గురువారం తెల్లవారు జాము వరకు టెంట్లోనే కూర్చొని నిరసన తెలిపారు. వారికి గ్రామస్థులు సంఘీభావం తెలిపారు. అన్‌రాక్ కంపెనీ యాజమాన్యం దిగొచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు. 

Similar News

News November 25, 2025

ములుగు: చేయూత పెన్షన్ వివరాలు

image

జిల్లాలో చేయూత పెన్షన్ లబ్ధిదారుల వివరాలు వృద్ధాప్య 15,338 (రూ.3.09కోట్లు), వితంతు 16,440 (రూ.3.31కోట్లు), ఒంటరి మహిళ 1,516 (0.30కోట్లు), కల్లుగీత కార్మికులు 217 (రూ.0.44కోట్లు), బీడీ కార్మికులు 91 (రూ.0.02 కోట్లు), బోదకాలు 39 (రూ.0.08 కోట్లు), డయాలసిస్ 28 (రూ.0.06 కోట్లు), దివ్యాంగులు 3,869 (రూ.1.55 కోట్లు), చేనేత 205 (రూ.0.41 కోట్లు) అందజేస్తున్నారు.

News November 25, 2025

పెద్దపల్లిలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం

image

RGM సీపీ ఆదేశాలపై PDPLలోని ఒక కాలేజీలో పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించింది. ఇన్‌ఛార్జ్ SI లావణ్య మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్‌పై విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. వేధింపులపై 6303923700, సైబర్ మోసాలపై 1930, అత్యవసర పరిస్థితుల్లో 100కు కాల్ చేయాలన్నారు. బస్టాండ్, ప్రధాన చౌరస్తాల్లో రెగ్యులర్ పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

News November 25, 2025

పెండింగ్ దరఖాస్తులు వెంటనే సమర్పించండి: కలెక్టర్

image

PDPL కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయని ఎస్సీ విద్యార్థులను గుర్తించి వెంటనే https://telanganaepass.cgg.gov.in ద్వారా దరఖాస్తులు DEC 31లోపు సమర్పించాలని సూచించారు. దరఖాస్తుల హార్డ్‌ కాపీలు, బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను పూర్తిచేసి SC అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.