News March 12, 2025
అనకాపల్లి: రాష్ట్ర పండుగగా నూకాంబిక అమ్మవారి జాతర

అనకాపల్లి నూకాంబిక అమ్మవారి జాతరకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 28 కొత్త అమావాస్య నుంచి వచ్చేనెల 27వ తేదీ వరకు అమ్మవారి జాతర జరుగుతుంది. ఇటీవల నూకాంబిక జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని సీఎం చంద్రబాబుకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 14, 2025
KMR: జిల్లా కోర్టు సంచలన తీర్పు

హత్య కేసులో KMR జిల్లా కోర్టు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. జిల్లా SP రాజేష్ చంద్ర వివరాలిలా.. మాల్తుమ్మెద వాసి రామ కృష్ణయ్యకు, కర్రె రాజయ్యతో తగాదాలు ఉన్నాయి. ఈ విషయంలో పెద్దల సమక్షంలో మాట్లాడుతుండగా..రాజయ్య, రామ కృష్ణయ్య తలపై కర్రతో కొట్టి చంపాడు. నాగిరెడ్డి పేట్ PSలో కేసు నమోదైంది. విచారణ అనంతరం జిల్లా జడ్జి వరప్రసాద్ రాజయ్యకు జీవిత ఖైదు, రూ.10 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు.
News March 14, 2025
సంగారెడ్డి: ‘ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు రూల్స్ పాటించాలి’

జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీ దేవి తెలిపారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని సూచించారు. ఆసుపత్రిలో జరిగే జనన, మరణ వివరాలను రెగ్యులర్‌గా సమర్పించాలని తెలిపారు.
News March 14, 2025
హనుమకొండ: ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

హోళీ పండుగను పురస్కరించుకుని కలెక్టర్ పి.ప్రావిణ్య జిల్లా ప్రజలకు హోళీ వేడుక శుభాకాంక్షలు తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఈ హోళీ వేడుక ప్రజలందరి జీవితాలలో సంతోషపు వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలు ఆనందోత్సాహాలతో హోళీ వేడుక జరుపుకోవాలని అభిలషించారు. సహజ రంగులను వినియోగిస్తూ సంప్రదాయబద్ధంగా హోళీ నిర్వహించుకోవాలని హితవు పలికారు.