News March 26, 2025

అనకాపల్లి: రుణాల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

పీఎం ఉపాధి కల్పన పథకం కింద రుణాలు పొందేందుకు అనకాపల్లి జిల్లాలో ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు తదితరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మైనార్టీ కార్పొరేషన్ అనకాపల్లి జిల్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షంసున్నీషా బేగం  బుధవారం తెలిపారు. తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవారంగానికి రూ.20 లక్షలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 4, 2025

ADB: ‘సైనికుల సహాయార్థం విరాళాలు అందించాలి’

image

దేశ రక్షణకు సరిహద్దులో బాధ్యత, త్యాగనిరతి, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న సైనికుల సహాయార్థం సైనిక పతాక దినోత్సవ నిధి ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సైనిక పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 5న ఎన్‌సీసీ క్యాడెట్లు జిల్లా కేంద్రంలో విరాళాలు సేకరిస్తారన్నారు. తోచిన విరాళాలు అందించి, దేశ రక్షణకు శ్రమిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని పేర్కొన్నారు.

News December 4, 2025

‘అఖండ-2’ రిలీజ్ ఆపాలి: మద్రాస్ హైకోర్టు

image

‘అఖండ-2’ విడుదలను నిలిపివేయాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ‘అఖండ-2’ నిర్మాణ సంస్థ 14 రీల్స్(ఇప్పుడు 14 రీల్స్ ప్లస్) తమకు రూ.28 కోట్లు ఇవ్వాల్సి ఉందని ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. దీంతో సమస్య పరిష్కారం అయ్యే వరకు 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ‘అఖండ2’ విడుదల చేయొద్దని కోర్టు ఆదేశించింది. దీనిపై నిర్మాణ సంస్థ ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి.

News December 4, 2025

పుతిన్‌ ఇష్టపడే ఆహారం ఇదే!

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇవాళ భారత్‌కు రానున్నారు. ఆయన PM మోదీతో కలిసి ప్రైవేట్ డిన్నర్ చేస్తారని సమాచారం. పుతిన్ సంప్రదాయ వంటకాలను ఇష్టపడతారు. బ్రేక్‌ఫాస్ట్‌లో చీజ్, తేనె కలిపి చేసే ట్వోరోగ్ తింటారు. గుడ్లు, పండ్ల జ్యూస్ తీసుకుంటారు. చేపలు, గొర్రె మాంసం ఇష్టంగా తింటారు. షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉంటారు. అరుదుగా ఐస్‌క్రీమ్ తీసుకుంటారు. అధికారిక డిన్నర్లలో చేపల సూప్, నాన్ వెజ్‌కు ప్రాధాన్యమిస్తారు.