News February 23, 2025

అనకాపల్లి: రూ.14.36 లక్షల నష్టపరిహారం అందజేత

image

విశాఖ నుంచి తూర్పుగోదావరి జిల్లాల మధ్య 108 విద్యుత్ సమస్యలను పరిష్కరించి బాధితులకు రూ.14.36 లక్షల నష్టపరిహారం అందజేసినట్లు సీజీఆర్ఎఫ్ ఛైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ తెలిపారు. అనకాపల్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శనివారం నిర్వహించారు. సమస్యల సత్వర పరిష్కారానికి 1912 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చునని అన్నారు.

Similar News

News March 19, 2025

సంగారెడ్డి: 24 లోపు పూర్తిచేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఉపాధి హామీ, పంచాయతీల శాఖల ఆధ్వర్యంలో గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అభివృద్ధి పనులు ఈనెల 24 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్డీఓ జ్యోతి, పంచాయతి రాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

News March 19, 2025

వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

image

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.

News March 19, 2025

వనపర్తి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక 

image

సీతారాముల కళ్యాణం తిలకించడానికి భద్రాచలం వెళ్లని వారికి ఆర్టీసీ వారు కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. రూ.151 చెల్లించి రసీదు పొందితే భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే చేర్చుతారన్నారు. వివరాల కోసం వనపర్తి-9866344200, పెబ్బేరు-8801828143, కొత్తకోట-8886848518, ఆత్మకూర్-7382829494లో సంప్రదించాలన్నారు.

error: Content is protected !!