News October 25, 2024

అనకాపల్లి: ‘రైతులు పంటల భీమా పథకాన్ని వినియోగించుకోవాలి’

image

వచ్చే రబీ సీజన్‌కు సంబంధించి పంటల భీమా పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ సూచించినట్లు అనకాపల్లి జేసీ జాహ్నవి తెలిపారు. గురువారం పంటల బీమాపై జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖ అధికారులతో సెక్రటరీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇతరుల ప్రమేయం లేకుండా రైతులే నేరుగా ప్రీమియం కట్టుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు.

Similar News

News November 9, 2024

విశాఖ: చిట్టితల్లి ఆరోజు నీతో తప్పకుండా మాట్లాడతా-మంత్రి లోకేశ్

image

అక్కయ్యపాలేనికి చెందిన బాలిక కీర్తి హాఫ్ శారీ ఫంక్షన్ ఈ నెలలో జరగనుంది. దీంతో ఆ బాలిక ఇన్విటేషన్‌ను ‘x’లో మంత్రి నారా లోకేశ్‌‌కు ట్యాగ్ చేస్తూ అంకుల్ నా ఫంక్షన్‌కు మీరు తప్పకుండా రావాలని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కి లోకేశ్ స్పందిస్తూ.. ఇన్విటేషన్ పంపినందుకు థాంక్యూ చిట్టితల్లి. నేను ఆరోజు రాలేను గానీ తప్పకుండా నీతో ఫోన్‌లో మాట్లాడతా. నా బ్లెస్సింగ్స్ నీకు ఎప్పుడు ఉంటాయమ్మ అంటూ రీ ట్వీట్ చేశారు.

News November 9, 2024

విశాఖ: ఇసుక నిల్వ కేంద్రం, రవాణా కోసం లాటరి

image

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఇసుక విధానం సంబంధించి డిపోల ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చేందుకు నోటిఫికేషన్ శుక్రవారం ఇచ్చారు. విశాఖ కలెక్టర్ ఆదేశాలు మేరకు జీవో విడుదల చేశారు. ఆసక్తి కలవారు భీమిలీ, ముడసర్లోవ, గాజువాకలో 4 ఏకరాల స్థలం కలిగి ఉండాలని అన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 14వ తేదీలోపు రూ.5,000 డీడీ గనుల శాఖ కార్యాలయంలో చెల్లించాలన్నారు.

News November 9, 2024

సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి: అనకాపల్లి కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శాఖకు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. లక్ష్యాలు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.