News March 17, 2025
అనకాపల్లి: రైళ్లు ఆలస్యం.. సమాచార కేంద్రం ఏర్పాటు

విజయరామరాజుపేట వద్ద రైల్వే వంతెన కుంగిన నేపథ్యంలో విజయవాడ-విశాఖపట్నం మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి, విశాఖ, సింహాద్రి, అమరావతి, గరీబ్‌రథ్, మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విశాఖ చేరుకోవడం ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ రైల్వేస్టేషన్‌లో సమాచార కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 08912746330, 08912744619 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News March 18, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఫినాయిల్ తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కి చెందిన పెంటయ్య(62) ఆదివారం ఇంట్లో బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదైంది.
News March 18, 2025
చిట్యాల: అమ్మ జ్ఞాపకంగా పూల వనం!

అమ్మ అనే భావం అనిర్వచనీయానికి నిర్వచనంగా పూలవనాన్ని అమ్మ జ్ఞాపకంగా ఏర్పాటు చేశారు ముగ్గురు కుమారులు. బృందావనాన్ని తలపించేలా పూల వనంలో పక్షులకు ఆహారం, నీరును అందించి అమ్మ ప్రేమను జీవాలకు సైతం చాటుకుంటున్నారు. చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మెరుగు పద్మ కొన్ని నెలల క్రితం మరణించారు. తల్లిని మించిన దైవం లేదనడానికి నిదర్శనంగా అమ్మ జ్ఞాపకాలను కుమారులు ఇలా అపారంగా ఆరాధిస్తున్నారు.
News March 18, 2025
NZB: స్నేహితుడి ఇంట్లో దావత్.. గొడ్డలితో ATTACK

తాగిన మైకంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం గొడ్డలితో వేటు వరకు దారితీసింది. ఈ ఘటన మాక్లూర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కల్లెడ గ్రామానికి చెందిన దేవతి పోశెట్టి అనే వ్యక్తి సోమవారం దుబాయ్ వెళ్లాల్సి ఉండగా, తన స్నేహితుడైన తెడ్డు లింగం ఇంట్లో దావత్ ఇచ్చాడు. దేవతి పోశెట్టి, తెడ్డు లింగం ఇద్దరికి మద్యం మత్తులో గొడవ జరిగింది. దీంతో లింగం, పోశెట్టిపై గొడ్డలితో దాడిచేశాడు