News January 30, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

అనకాపల్లి పట్టణ పూడిమడక బస్ స్టాప్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. బుధవారం షేక్ సుభాన్ (60) ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు ముందు నుంచి నడిచి వెళుతున్నాడు. ఆ సమయంలోనే డ్రైవర్ గమనించకుండా బస్సును నడపడంతో సుభాన్‌ను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 7, 2025
SKLM: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.
News December 7, 2025
ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.
News December 7, 2025
చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి-హజ్రత్ నిజాముద్దీన్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ తెలిపారు. సోమవారం రాత్రి 9.45 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి బుధవారం మ.2 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌కు, బుధవారం సా.4 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.30కు చర్లపల్లికి చేరుకుంటుందని పేర్కొన్నారు.


