News April 10, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

రాంబిల్లి (M) వెంకటాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. అచ్యుతాపురం(M) గురుజాపాలెంకు చెందిన చిన్నాజీ (26) మరో వ్యక్తితో కలిసి బైక్ పై వెంకటాపురం నుంచి రాంబిల్లి వెళుతుండగా వ్యాను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన చిన్నాజీని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు SI నాగేంద్ర బుధవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 16, 2026
విశాఖ మీదగా అమృత్ భారత్ స్లీపర్ సర్వీస్.. రేపట్నుంచే

విశాఖలో రైల్వే ప్రయాణికులకు రైల్వే బోర్డు తీపి కబురు అందించింది. న్యూజల్ పాయ్ గురి నుంచి విశాఖ మీదుగా తమిళనాడులోని తిరుచిరాపల్లి వరకు వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు
రైల్వే బోర్డు శుక్రవారం తెలిపింది. జనవరి 17న మధ్యాహ్నం న్యూజల్‌పాయ్‌గురి నుంచి మరుసటి రోజు 1:45కు విశాఖ చేరుతుంది. దువ్వాడకు మధ్యాహ్నం 3.35కు చేరుతుంది.
News January 16, 2026
కర్నూలు: ‘యువకుడి మృతి.. గుర్తిస్తే చెప్పండి’

కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ సమీపంలో ఇవాళ సాయంత్రం బైక్ ఢీకొనడంతో గుర్తు తెలియని యువకుడు మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 25-30 ఏళ్లు ఉంటాయి. ఎడమ చేతి మణికట్టుపై ॐ, GP పచ్చబొట్లు ఉన్నాయి. వివరాలు తెలిసిన వారు కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్ 9121101063 నంబర్‌కు సంప్రదించాలని పోలీసులు కోరారు.
News January 16, 2026
మాడుగుల: రెండు రోజుల తర్వాత మృతదేహం తరలింపు

మాడుగుల ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ రత్నకుమారి కేజీహెచ్‌లో చి<<18874616>>కిత్స పొందుతూ మృతి చెందగా <<>>అంబులెన్స్ అందించడంలో నిర్లక్ష్యం జరిగింది. దీనిపై వెంటనే స్పందించిన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి రత్నకుమారి మృతదేహాన్ని మాడుగుల సమీపంలోని గిరిజన ప్రాంతానికి తరలించారు. ఆ కుటుంబం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు


