News January 24, 2025

అనకాపల్లి: లాటరీ ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపు

image

అనకాపల్లి జిల్లాలో కల్లుగీత కులాల వారికి లాటరీ ద్వారా 15 మద్యం దుకాణాలను కేటాయించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 2024-26కు సంబంధించి నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించి షాపులను కేటాయించామన్నారు.

Similar News

News February 9, 2025

మెదక్: కెనడా వెళ్లేందుకు సిద్ధం.. అంతలోనే ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం ధర్మరాజుపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ధర్మరాజుపల్లికి చెందిన శ్రీవర్ధన్ రెడ్డి (24) ఇటీవల డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏ చేసేందుకు కెనడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మనోహరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

News February 9, 2025

సిద్దిపేట: జాతీయ స్థాయి పోటీలకు జిల్లా విద్యార్థినులు

image

గత నెలలో తూప్రాన్‌లో నిర్వహించిన SGF అండర్‌ 14 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నంగునూరు మండలం గట్ల, మల్యాల విద్యార్థినిలు ఈశ్వరి, అను జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న విద్యార్థులను హెచ్ఎం రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు రాజకుమార్ అభినందించారు. వారు మాట్లాడుతూ 13 నుంచి 16 వరకు మహారాష్ట్రలో జరిగే పోటీల్లో ఈశ్వరి, అను పాల్గొంటారని తెలిపారు.

error: Content is protected !!