News March 28, 2025
అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
Similar News
News December 6, 2025
సెమీస్లో పాలమూరు అండర్-14 క్రికెట్ జట్టు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలో జరుగుతున్న అండర్-14 క్రికెట్ పోటీల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జట్టు సెమీఫైనల్కు చేరుకుంది. పాలమూరు జట్టు వరంగల్, అదిలాబాద్, మెదక్ జట్లపై వరుస విజయాలు సాధించినట్లు కోచ్ సురేశ్ తెలిపారు. జిల్లా జట్టు సెమీస్ చేరడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ, రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవాలని ఆకాంక్షించారు.
News December 6, 2025
భద్రాద్రి జోన్ పరిధిలో 22 మందికి ఏఎస్సైలుగా పదోన్నతులు

భద్రాద్రి జోన్ పరిధిలోని 22 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్సైగా పదోన్నతి కల్పిస్తూ ఇన్ఛార్జ్ రేంజ్ డీఐజీ సన్ప్రీత్ సింగ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతో పాటు మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న వారికి ఈ పదోన్నతి లభించింది. ఈ మేరకు పదోన్నతి పొందిన వారిని జోన్ పరిధిలో వివిధ జిల్లాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
News December 6, 2025
ఎన్నికల కోడ్ తప్పనిసరిగా అమలు చేయాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల సంఘం నియమాలను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ ఆదేశించారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన రిటర్నింగ్ అధికారులు, ఆర్డీవోలు, ఎంపీడీవోలతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అలసత్వం వహించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


