News April 13, 2025
అనకాపల్లి: వచ్చే నెల 12నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

వచ్చే నెల 12వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత శనివారం తెలిపారు. ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఫీజులు చెల్లించాలన్నారు. ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులు కావాలని సూచించారు.
Similar News
News November 21, 2025
RTC బస్సులో ప్రయాణించిన సీఎం సతీమణి

AP: కూటమి ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని CM చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వినియోగించుకున్నారు. ఆధార్ కార్డు చూపించి, ఫ్రీ టికెట్ పొందారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆమె శాంతిపురం నుంచి తుమ్మిసి వరకు బస్సులో ప్రయాణించారు. మహిళలతో మాట్లాడి ఉచిత బస్సు ప్రయాణం గురించి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మిసి పెద్ద చెరువులో జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 21, 2025
విశాఖ: యాంటీ బయోటిక్స్ వాడుతున్నారా?

విశాఖ DMHO కార్యాలయం వద్ద శుక్రవారం యాంటీ మైక్రోబియల్ రెసిస్టన్స్ ర్యాలీ నిర్వహించారు. DMHO జగదీశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. యాంటీ బయోటిక్స్ను అనవసరంగా వాడటం వలన డ్రగ్ రెసిస్టన్స్ పెరుగుతుందన్నారు. డాక్టర్స్ సలహాల మేరకే యాంటీ బయోటిక్స్ వాడాలన్నారు. డాక్టర్స్ సలహా లేకుండా యాంటీ బయోటిక్స్ను వాడితే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. హెల్త్ సిబ్బంది ప్రజలకు ఈ విషయాన్ని తెలియచేయాలన్నారు.
News November 21, 2025
సంగారెడ్డి: హోంగార్డుల సంక్షేమానికి భరోసా: ఎస్పీ

హోంగార్డుల సంక్షేమానికి భరోసా కల్పిస్తామని ఎస్పీ పారితోష్ పంకజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ పరిధి మైదానంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. హోంగార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్పారు. శాలరీ అకౌంట్ ఉన్న హోంగార్డు మరణిస్తే రూ.40 లక్షల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.


