News January 25, 2025
అనకాపల్లి: ‘విజయ సాయి రెడ్దిది రాజీనామా డ్రామా’

రాజీనామాతో చేసిన తప్పుల నుంచి తప్పించుకునే డ్రామా చేస్తున్నారని విజయసాయి రెడ్డి పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ ఆరోపణలు చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్గా మూడున్నర సంవత్సరాలు వైసీపీ అంటే విజయసాయిరెడ్డి అన్నట్టుగా ఆయన హవా సాగిందని, దోచుకున్న దోపిడీలలో అరెస్టు భయంతేనె ఈ డ్రామాలకు తెర లేపారని ఆయన విమర్శించారు.
Similar News
News December 8, 2025
పెద్దపల్లి: పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం అందించాలి: కలెక్టర్

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9, 12న రెండో, మూడో విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. పోలింగ్ సామగ్రి సరఫరా, కేంద్రాల పరిశీలన, కౌంటింగ్, ఉపసర్పంచ్ ప్రక్రియలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
News December 8, 2025
పార్వతీపురం: ఎస్పీ పీజీఆర్ఎస్కు 9 వినతలు

ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు 9 వినతులు వచ్చినట్లు ఎస్సీ మాధవరెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కార్యాలయంలో అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను తక్షణమే పరిష్కరించి అర్జీదారులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలు పరిష్కరించి వాటిని నివేదికను ఎస్పీ కార్యాలయానికి అందజేయాలని ఆదేశించారు.
News December 8, 2025
కరీంనగర్ డీఈఓగా అదనపు కలెక్టర్

కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారిగా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాంక్డేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ డాక్టర్ ఈ నవీన్ నికోలావీస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి డీఈఓగా ఉన్న శ్రీరామ్ మొండయ్య ఇకపై డైట్ ప్రిన్సిపాల్గా కొనసాగనున్నారు. పలువురు డీఈఓ పదవికి ఆసక్తి చూపకపోవడం గమనార్హం.


