News February 21, 2025
అనకాపల్లి: వైసీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం

అనకాపల్లి జిల్లా వైసీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షునిగా పి శివ సత్యనారాయణ (జోసఫ్), విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడిగా బి హేమంత్ కుమార్ను నియమించింది. అలాగే జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కె సతీష్, జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలుగా బి అనురాధను నియమించింది.
Similar News
News December 8, 2025
నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.
News December 8, 2025
బరువు తగ్గాలంటే వీటిని ట్రై చేయండి!

బరువు తగ్గాలనుకునేవారికి డ్రైఫ్రూట్స్ సాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. ‘బాదం తీసుకుంటే వాటిలోని ఫైబర్, కొవ్వుల వల్ల ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఆక్రోట్లలో క్యాలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆకలి తగ్గుతుంది. భోజనానికి ముందు గుప్పెడు పల్లీలు తింటే బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఖర్జూరాల వల్ల అధిక శక్తి అంది త్వరగా ఆకలి కాకుండా ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు’ అని సూచిస్తున్నారు.
News December 8, 2025
సిద్దిపేట: ఈ ప్రాంతాల్లో సెక్షన్163 అమలు: సీపీ

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలు (మొదటి దశ) ప్రశాంతంగా, శాంతి భద్రతల నడుమ నిర్వహించేందుకు సెక్షన్ 163 BNSS, 2023 అమలులో ఉంటుందని సీపీ విజయ్ కుమార్ తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 12 ఉదయం 7 గంటల వరకు దౌల్తాబాద్, గజ్వేల్, జగదేవపూర్, మార్కుక్, ములుగు, రాయపోల్, వర్గల్లో అమలులో ఉంటుందన్నారు.


