News November 11, 2024
అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ప్రతిభ పరీక్ష

అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ఆదివారం R&B,ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతిభ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు అనకాపల్లి, చోడవరం, ఎస్.రాయవరం, రావికమతం, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర మండలాల నుంచి 100 మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు మార్గదర్శిగా నిలుస్తాయన్నారు.
Similar News
News November 5, 2025
ఆరిలోవలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

సింహాచలం బీఆర్టీఎస్ రోడ్డులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింహాచలం నుంచి బైక్ పై ఆరిలోవ వైపు వస్తున్న ఇద్దరు యువకులు రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైకు పై ఉన్న ఇద్దరు యువకులు గాయపడడంతో ఆసుపత్రికి తరలించినట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. మృతుడు గురుద్వార్కి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు.
News November 5, 2025
రాష్ట్ర భవిష్యత్తుకే తలమానికం: మంత్రి డోలా

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.
News November 5, 2025
విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.


