News November 11, 2024

అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ప్రతిభ పరీక్ష

image

అనకాపల్లి శ్రీగౌరీ గ్రంథాలయంలో ఆదివారం R&B,ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు సంబంధించి ప్రతిభ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు అనకాపల్లి, చోడవరం, ఎస్.రాయవరం, రావికమతం, రాంబిల్లి, అచ్యుతాపురం తదితర మండలాల నుంచి 100 మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రతిభ పరీక్షలు మార్గదర్శిగా నిలుస్తాయన్నారు.

Similar News

News December 14, 2024

విశాఖ: 18 ఏళ్లు నిండని బాలుడిపై 11 కేసులు

image

విశాఖలోని కంచరపాలెంకు చెందిన బాల నేరస్థుడిని శుక్రవారం 3వ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 18 ఏళ్లు కూడా నిండని బాలుడిపై 11 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. నేరస్థుడిపై చోరీ కేసులు నమోదు కాగా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో నిందితుడిని మద్దిలపాలెంలో అరెస్ట్ చేసి జువైనల్ హోమ్‌కు తరలించారు.

News December 13, 2024

పెందుర్తి: మెగా, అల్లు ఫ్యామిలీలు ఒక్కటే: బొలిశెట్టి

image

అల్లు అర్జున్‌ అరెస్ట్ వ్యవహారంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ ద్వారా స్పందించారు. ‘హైకోర్టు తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌కు హీరో వస్తున్న విషయం మీడియాలో 2రోజుల ముందే వచ్చింది. CP తెలియదనడం హాస్యాస్పదం. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు. 

News December 13, 2024

విశాఖ: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’

image

ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు వంటివి రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చనన్నారు.