News March 18, 2024

అనకాపల్లి: సచివాలయ ఉద్యోగి మృతి.. రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా 

image

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం ములకలపల్లిలో విద్యుత్ షాక్‌కి గురై మృతి చెందిన సచివాలయ ఉద్యోగి డి.చిరంజీవి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. చెక్కుని మృతుడి భార్య హేమలతకు దేవరాపల్లి హెచ్‌డీటీ డీ.ఆనంద్ రావు సోమవారం అందజేశారు. ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా కటౌట్లు తొలగిస్తూ విద్యుత్ షాక్‌తో చిరంజీవి ఆదివారం మృతి చెందాడు.

Similar News

News December 29, 2025

విశాఖలో ఆగని కుక్కల దాడులు!

image

జీవీఎంసీ పరిధిలో వీధి కుక్కల దాడులు ఆగడం లేదు. సింథియాలో ఈ నెల 21 నుంచి ఇప్పటివరకు 20 మందిపై కుక్కలు దాడి చేశాయి. GVMC పరిధిలో 2లక్షల వరకు కుక్కలు ఉన్నట్లు అంచనా. వాటి నియంత్రణ కోసం అరిలోవ, కాపులుప్పడ, సవరాల ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వెటర్నరీ అధికారి రాజ రవికుమార్ తెలిపారు. రోజుకు 50 నుంచి 60 వరకు కుక్కల ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెప్పారు.

News December 29, 2025

గాజువాక: ఉరి వేసుకుని బాలుడి ఆత్మహత్య

image

గాజువాక డిపో 59 వార్డు నక్కవానిపాలెంలో ఓ బాలుడు ఉరివేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో యుగంధర్ వర్మ (16) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి అత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News December 29, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయలలో నేడు పీజీఆర్ఎస్

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీ జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.