News March 25, 2025
అనకాపల్లి: సభ్యుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి జిల్లాలో బాలల సంక్షేమ సమితి, బాలల న్యాయమండలిలో సభ్యుల నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాలల సంక్షేమ సంస్కరణలు, వీధి బాలల సంక్షేమ శాఖ జిల్లా పర్యవేక్షణ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 9వ తేదీలోగా విజయవాడ వీధి బాలల సంక్షేమ శాఖ డైరెక్టర్కు పంపించాలన్నారు.
Similar News
News November 23, 2025
ఏలూరు జిల్లా కలెక్టర్ వార్నింగ్

వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లు, మెడికల్ కాలేజీ విద్యార్థులు గాని ఒక్క ఫిర్యాదు చేసినా వెనువెంటనే విచారణ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రోగులకు సిబ్బంది అందించే సేవలపై వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
News November 23, 2025
ఉమ్మడి వరంగల్లో 1,708 పంచాయతీలు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 మండలాల్లో మొత్తం 1,708 గ్రామ పంచాయతీలు, 15,006 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పోలింగ్ కోసం 15,006 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
WGL(11): 317 జీపీలు, 2,754 వార్డులు
HNK(12): 210 జీపీలు, 1,986 వార్డులు
జనగామ(12): 280 జీపీలు, 2,534 వార్డులు
మహబూబాబాద్(18): 482 జీపీలు, 4,110 వార్డులు
ములుగు(10): 171 జీపీలు, 1,520 వార్డులు
భూపాలపల్లి(12): 248 జీపీలు, 2,101 వార్డులు
News November 23, 2025
మచిలీపట్నం: నాన్ వెజ్కు రెక్కలు.!

కార్తీక మాసం ముగియటంతో జిల్లాలో మాంసపు దుకాణాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి. నెల రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉన్న ప్రజలు ఆదివారం మార్కెట్కు వెళ్లి తమకు ఇష్టమైన మాంసాహారం (చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు) కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల పాటు తగ్గిన మాంసాహారాల ధరలు ఆదివారం ఆమాంతం పెరిగిపోయాయి. కేజీ మటన్ రూ.900, చికెన్ రూ. 220, రొయ్యలు రూ.400ల వరకు అమ్ముతున్నారు.


