News February 27, 2026

అనకాపల్లి: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

image

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో దొంగతనం కేసు మీద జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Similar News

News April 19, 2026

హైదరాబాద్: ప్రతి ఒక్కరూ 20% నీటిని ఆదా చేయాలి

image

వేసవి దృష్ట్యా వచ్చే 45 రోజులు అత్యంత కీలకమని, ప్రతి ఒక్కరూ 20 శాతం నీటిని ఆదా చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కోరారు. నగరంలో నీటి సరఫరాపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. గత నాలుగేళ్లతో పోలిస్తే ట్యాంకర్ల డిమాండ్ భారీగా పెరిగిందని, సరఫరా 52 వేల నుంచి లక్షా 8 వేలకు చేరిందన్నారు. కేవలం 20 శాతం ప్రాంతాల్లోనే అధిక డిమాండ్ ఉందని, నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

News April 19, 2026

పాకాల: హైవేపై వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

పాకాల నేండ్రగుంట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మృతదేహం రెండు ముక్కలై గుర్తుపట్టలేని స్థితిలో పడి ఉంది. ఘటనాస్థలిలో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్‌ ప్రకారం తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన ‘సతీష్’గా తెలుస్తోంది. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 19, 2026

విపక్షాలపై మోదీ ‘భ్రూణ హత్య’ అస్త్రం!

image

మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడాన్ని మోదీ ‘భ్రూణ హత్య’తో పోల్చడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు అంటున్నారు. సాధారణ విమర్శల కంటే ఇలాంటి భావోద్వేగ పదాలు వాడటం వల్ల మహిళా ఓటర్లలోకి సందేశం బలంగా వెళ్తుందని BJP భావన. విపక్షాలు బిల్లును అడ్డుకోవడం అంటే ఒక గొప్ప ప్రయత్నాన్ని పురిట్లోనే చంపేయడమేనని మోదీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పదం రాజకీయంగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.