News February 25, 2026
అనకాపల్లి స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలి: కలెక్టర్

స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా పని చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్‌లో స్వర్ణాంధ్ర-2047 ప్రణాళికకు సంబంధించి విజన్ యాక్షన్ ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పీ-4 విధానం అమలు జరుగుతుందన్నారు. అభివృద్ధి దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. సమాజంలో దిగువ స్థాయిలో ఉన్న ప్రజలను అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకురావాలని సూచించారు.
Similar News
News April 14, 2026
ADB: లొంగిపోయిన మావోయిస్టులతో DGP చర్చలు

DGP శివధర్ రెడ్డి ఉమ్మడి ADB జిల్లాలో పర్యటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లొంగిపోయిన నక్సలైట్లకు ఇప్పటికీ పునారావాసం కల్పించకపోవడం, రివార్డులు అందించకపోవడం, ఇంటి, వ్యవసాయ భూముల పంపిణీ వంటి హామీలు అమలు కాకపోవడం వంటి సమస్యలు ఆయన దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఉట్నూర్‌లో మాజీ మిలిటెంట్లతో సమావేశమై సమస్యలు విన్న ఆయన, త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
News April 14, 2026
మెదక్: అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ విడుదల

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను అడిషనల్ కలెక్టర్ మెంచు నగేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ వారోత్సవాల లక్ష్యమన్నారు. ఇళ్లు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరూ అగ్ని భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి జి.వేణు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
News April 14, 2026
KBR బార్ గొడవ కేసులో మరో ఇద్దరి అరెస్ట్: డీఎస్పీ

కర్నూలు కేబీఆర్ బార్ వద్ద జరిగిన గొడవలో విద్యార్థి జాన్ వేస్లీ మృతి కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు DSP ఉపేంద్ర బాబు తెలిపారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేయగా, తాజాగా రాజీవ్ నగర్‌కు చెందిన శాంతిరాజు రెడ్డి, తులాసాపురం శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరికొంత మంది నిందితులను గుర్తించినట్లు, వారి అరెస్టుకు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ వివరించారు.


