News April 13, 2025

అనకాపల్లి: 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 14న  రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం  ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Similar News

News September 18, 2025

చిన్నమండెం: గుండెపోటుతో టీచర్ మృతి

image

చిన్నమండెం మండలం చాకిబండ తెలుగు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న బీవీ శ్రీధర్ రెడ్డి బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. విద్యార్థులకు పాఠాలు చెబుతుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలో చనిపోయారు. ఆయన మృతి పట్ల మండల వ్యాప్తంగా ఉపాధ్యాయులు విచారం వ్యక్తం చేశారు.

News September 18, 2025

కర్నూలు మార్కెట్ యార్డుకు నేడు, రేపు సెలవు

image

కర్నూలు మార్కెట్ యార్డుకు ఇవాళ, రేపు సెలవు ప్రకటించినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ బి.నవ్య తెలిపారు. మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు ఎక్కువగా ఉన్నాయని, ఉల్లిని ట్రేడింగ్, బహిరంగ వేలం ద్వారా బయటకు తరలించడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇవాళ, రేపు ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో ఉల్లి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

News September 18, 2025

తిరుపతి: DSC అభ్యర్థులకు గమనిక

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో DSCకి ఎంపికైన అభ్యర్థులందరికీ CM చంద్రబాబు చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగాలకు ఎంపికన వారంతా రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కాలేజీ వద్దకు ఇవాళ ఉదయం 7గంటలకు చేరుకోవాలని DEO కేవీఎన్ కుమార్ కోరారు. ఫొటో, ఆధార్, కాల్ లెటర్‌తో వస్తే వారిని బస్సుల్లో విజయవాడకు తీసుకెళ్తామన్నారు.