News April 13, 2025
అనకాపల్లి: 14న ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈ నెల 14న రద్దు చేస్తున్నట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబేద్కర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజా వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
Similar News
News April 22, 2025
లక్షెట్టిపేట: యాక్సిడెంట్.. ఒకరి మృతి

లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం గ్రామ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మునుగంటి చంద్రశేఖర్(51) మృతి చెందాడని ఎస్సై సురేశ్ తెలిపారు. చంద్రశేఖర్ ఆదివారం మధ్యాహ్నం పౌరోహిత్యం ముగించుకొని వెంకట్రావుపేటకు వెళ్లే క్రమంలో ఎల్లారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారన్నారు. ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
News April 22, 2025
సంగారెడ్డి: సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా RYV అందించాలి: కలెక్టర్

సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా రాజీవ్ వికాసం పథకాన్ని అందించాలని బ్యాంకులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో రాజీవ్ యువ వికాసం పై సమీక్ష సమావేశం సోమవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మొత్తం 51,657 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. నిస్సహాయులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నిరుద్యోగులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అదరపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
News April 22, 2025
పెద్దపల్లి: ఈనెల 30లోపు రాజీవ్ యువ వికాసం వెరిఫికేషన్ పూర్తి: కలెక్టర్

ఈనెల 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ఆయన రివ్యూ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగులు ఆత్మగౌరవంతో జీవించేలా ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా లక్ష్యాల కేటాయింపు ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని సూచించారు. DRDO కాలిందిని, లీడ్ బ్యాంకు మేనేజర్ వెంకటేశ్, తదితరులు పాల్గొన్నారు.