News March 12, 2025
అనకాపల్లి: ’15లోగా దరఖాస్తులు చేసుకోవాలి’

మహాత్మ జ్యోతి బాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు మరో మూడు రోజుల్లో గడువు మునియనుంది. ఈనెల 15 లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అనకాపల్లి జిల్లా జ్యోతి బాపులే గురుకుల విద్యాలయాల కన్వీనర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఇంటర్, 5,6,7,8,9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లలో ప్రవేశానికి పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News December 2, 2025
డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు

1912: సినీనిర్మాత, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1985 : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1996: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం (ఫొటోలో)
* జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
News December 2, 2025
శ్రీలంక అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్

‘దిత్వా’ తుఫానుతో నష్టపోయిన శ్రీలంకకు అండగా ఉంటామని PM మోదీ తెలిపారు. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఆపరేషన్ సాగర్ బంధు కింద బాధితులకు నిరంతరం సాయం అందిస్తామన్నారు. శ్రీలంకలో తుఫాను బీభత్సానికి 300మందికి పైగా మరణించగా, లక్షన్నర మంది శిబిరాల్లో గడుపుతున్నారు. అటు విపత్తు జరిగిన వెంటనే సహాయక బృందాలు, సామగ్రిని పంపిన భారత్కు దిసనాయకే ధన్యవాదాలు తెలిపారు.
News December 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


