News March 26, 2025

అనకాపల్లి: 208 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,673 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావలసి ఉండగా 659 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News December 6, 2025

రేపు జాగ్రత్త.. ఈ జిల్లాలకు YELLOW ALERT

image

TG: రాష్ట్రంలో మళ్లీ చలి తీవ్రత పెరుగుతోంది. వచ్చే 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News December 6, 2025

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్‌తో మహిళ మృతి.. కానీ!

image

ప్రకాశంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ వచ్చిన మహిళ మృతి చెందినట్లు డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలానికి చెందిన వృద్ధురాలు గత నెల 11న అనారోగ్యానికి గురై మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లారన్నారు. 29న అక్కడ నిర్వహించిన టెస్టుల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్ వచ్చిందన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులు కూడా మృతికి కారణంగా డీఎంహెచ్వో తెలిపారు.

News December 6, 2025

వైవీయులో పీజీ ప్రవేశాలకు 8 నుంచి స్పాట్ అడ్మిషన్లు

image

కడప: YVU P.G (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈనెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ డా. టి. లక్ష్మీప్రసాద్ తెలిపారు. విద్యార్థులు బరిజనల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజుతో వైవీయులోని డీవోఏ ఆఫీసులో సంప్రదించాలన్నారు. ఏపీ పీజీ సెట్ రాయని వారు కూడా రావచ్చన్నారు. వివరాలకు
yvu.edu.in ను సంప్రదించాలని సూచించారు.