News March 26, 2025

అనకాపల్లి: 208 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన పదవ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,673 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావలసి ఉండగా 659 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News April 25, 2025

బుడగట్లపాలెం : సీఎం చేతుల మీదుగా రూ. 250 కోట్ల పంపిణీ 

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మత్స్యకార భరోసా పథకం కింద 250 కోట్ల రూపాయలు పంపిణీకి సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుడగట్లపాలెంలో గురువారం ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 26న నిధులు పంపిణీకి ముఖ్యమంత్రి రానున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎస్పీ కె.వి. మహేశ్వర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.

News April 25, 2025

మేయర్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తాం: అంబటి

image

గుంటూరు మేయర్ ఎన్నికపై వైసీపీ అనూహ్య మలుపు తిరిగింది. పోటీలో వైసీపీ పోటీ చేయదని రాజకీయ విశ్లేషకులు భావించారు. అయితే అంబటి రాంబాబు అభ్యర్థిని ప్రకటిస్తామని గురువారం తెలిపారు. ఈ నెల 28న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలు బృందావన్ గార్డెన్స్‌లో సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, డైమండ్ బాబు తదితరులు పాల్గొన్నారు.

News April 25, 2025

మహబూబ్‌నగర్: 108, 102 అమ్మ ఒడి వాహనాల ఆకస్మిక తనిఖీ

image

MBNR జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్‌లో వివిధ 108 వాహనాలను తెలంగాణ రాష్ట్ర ఫ్లీట్ హెడ్ గిరీశ్‌బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో రికార్డులను, పరికరాల పనితీరు, 102 అమ్మ ఒడి సిబ్బంది పనితీరు, వాహన నిర్వహణను పరిశీలించి సేవలను ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లా పోగ్రామ్ మేనేజర్ రవి, జిల్లా కోఆర్డినేటర్ ఉదయ్, ఉద్యోగులు పాల్గొన్నారు.

error: Content is protected !!