News February 26, 2026

అనకాపల్లి: 217 మంది విద్యార్థులు గైర్హాజర్

image

అనకాపల్లి జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా జరుగుతున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి ఎం. వినోద్ బాబు తెలిపారు. గురువారం జరిగిన సెకండ్ ఇయర్ పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాల్లో 12,390 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 12,173 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News April 14, 2026

రోబోలతోనే రష్యా స్థావరాన్ని దక్కించుకున్న ఉక్రెయిన్!

image

2022 నుంచి రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ ఇప్పుడు బరిలో రోబోలను నిలిపి మిషన్స్ చేపడుతోంది. ఈ క్రమంలో తొలిసారిగా జవాన్లు లేకుండానే రోబోలతో ఓ రష్యా స్థావరాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. గత మూడు నెలల్లో ఈ గ్రౌండ్ వెహికల్స్ 22వేలకుపైగా మిషన్స్ చేపట్టాయని తెలిపారు. టెక్నాలజీతో ప్రాణనష్టం తగ్గించొచ్చనడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.

News April 14, 2026

భూగర్భ జలమట్టం పెంపుకు జలధార-జలహారతి: కలెక్టర్

image

జిల్లాలో భూగర్భ జల మట్టం పెంపుకు జలధార-జలహారతి కార్యక్రమంలో భాగంగా రూ.26.46 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. వచ్చే మూడు నెలల్లో 274 నీటి సంఘాల ద్వారా మొత్తం 357 పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో సాగు నీటి సంఘాల పనులకు ఆమోదం తెలిపారు. జిల్లాలో భూగర్భ జల మట్టం 3 నుంచి 6 మీటర్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు.

News April 14, 2026

ఖమ్మం: నిర్మాణ కూలీ రేట్లపై త్వరలోనే తుది నిర్ణయం

image

ఖమ్మం జిల్లాలో నిర్మాణ రంగ కార్మికుల కూలీ రేట్ల పెంపుపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదని కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం బిల్డర్స్ అసోసియేషన్, కార్మిక సంఘాలతో ప్రాథమికంగా చర్చించామని, అధికారికంగా ధరలు ఖరారు కాలేదని తెలిపారు. త్వరలోనే మరోసారి కార్మిక సంఘాల నేతలతో భేటీ నిర్వహించి, అందరి ఏకాభిప్రాయం మేరకు కొత్త రేట్లను ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.