News April 4, 2025

అనకాపల్లి: 3 చోట్ల టెన్త్ పరీక్షా పేపర్ల మూల్యాంకనం

image

అనకాపల్లి జిల్లాలో పదవ తరగతి మూల్యాంకనం ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు కొనసాగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు తెలిపారు. అనకాపల్లి పట్టణంలో వేల్పుల వీధి టౌన్ బాలికోన్నత పాఠశాల, గవరపాలెం చిన్న హైస్కూల్, ఏఎంఎల్ హైస్కూల్లో మూల్యాంకనం జరుగుతున్నట్లు తెలిపారు. మూల్యాంకనం జరిగే స్కూల్స్ వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News February 28, 2026

ప.గో మూడు నెలల జీతాలు విడుదల.. Way2News ఎఫెక్ట్

image

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వేతనాల నిలిపివేతపై Way2News వచ్చిన కథనానికి ప్రభుత్వం స్పందించింది. సభ్యుల ఆర్థిక ఇబ్బందులను జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మశ్రీ సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ప్రభుత్వం తక్షణమే మూడు నెలల బకాయి వేతనాలను విడుదల చేసింది. ప్రభుత్వ సత్వర నిర్ణయం పట్ల ఉమ్మడి జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 28, 2026

పారిశుద్ధ్య పర్యవేక్షణలో ఐసీసీసీ కీలకం: కలెక్టర్

image

వరంగల్ నగర పారిశుద్ధ్య నిర్వహణలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) పాత్ర అత్యంత కీలకమని హనుమకొండ కలెక్టర్, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలోని ఐసీసీసీ కేంద్రంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ అంశంపై అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. శానిటేషన్ ప్రక్రియను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

News February 28, 2026

ఖమ్మం: గైర్హాజరు, నిర్లక్ష్యం.. 50 మంది టీచర్లకు నోటీసులు

image

ఖమ్మం జిల్లాలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 50 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై డీఈవో చైతన్య జైని శుక్రవారం చర్యలు చేపట్టారు. కారణం లేకుండా గైర్హాజరైన 24 మందికి, అనుమతి లేకుండా ఓడీ పేరుతో గైర్హాజరైన 14 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దెందుకూరు జడ్పీహెచ్‌ఎస్ ఉపాధ్యాయుడిపై ఫిర్యాదుల నేపథ్యంలో నోటీసులు జారీ చేశారు. ఏన్కూరు ఎంపీపీ స్కూల్ హెచ్ఎంను సస్పెండ్ చేశారు.