News March 29, 2025
అనకాపల్లి: 31న స్పందన కార్యక్రమం రద్దు: కలెక్టర్

మార్చి 31వ రంజాన్ సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినందున సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ విజయ కృష్ణణ్ శనివారం తెలిపారు. అలాగే అనకాపల్లి జిల్లా ప్రజలకు కలెక్టర్ ఉగాది, రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 20, 2025
తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్.. నలుగురి అరెస్ట్

చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 3.05 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఓ ప్రధాన పార్టీ మండల అధ్యక్షుడితో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్ పై దండుమల్కాపురం గ్రామానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త తహశీల్దార్ వీరబాయికి ఫిర్యాదు చేయగా.. తహశీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం అరెస్ట్ చేశారు.
News November 20, 2025
HYD: హోటళ్లలో సర్వీస్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు..!

HYDలో అనేక హోటళ్లలో సర్వీస్ టాక్స్ పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు రెస్టారెంట్లు ఈ సర్వీస్ ఛార్జీని బిల్లుల్లో బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లులు రూ.5 వేల- రూ.20 వేల వరకు రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీని కోరుతున్నారు.
News November 20, 2025
NLG: పైలట్ ప్రాజెక్టుగా 70 గ్రామాలు ఎంపిక!

నల్గొండ జిల్లాలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ప్రభుత్వం భూభారతిలో పక్కాగా హద్దులు తేల్చేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా సర్వే కోసం జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసింది. అందులో 8,627 సర్వేనెంబర్ల పరిధిలో 72,758.7 ఎకరాల భూమిని సర్వే చేసి లెక్కలు తేల్చనున్నారు. రెసిడెన్షియల్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ద్వారా సర్వే జరిపి అనంతరం ఆ వివరాలను భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయనున్నారు.


