News February 27, 2026

అనకాపల్లి: 310 విద్యార్థుల గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన 27 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 310 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈఓ వినోద్ బాబు తెలిపారు. మొత్తం 3,321 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 3,011 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News April 14, 2026

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో నిన్న తగ్గిన బంగారం, వెండి ధరలు ఇవాళ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు పెరిగి రూ.2,65,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News April 14, 2026

శాంతి భద్రతలను అందించడమే లక్ష్యం: నిర్మల్ ఎస్పీ

image

నిర్మల్ జిల్లా ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలను అందించడమే తమ లక్ష్యమని ఎస్పీ జానకి అన్నారు. నిర్మల్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని ఇందుకోసం రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా ‘పోలీస్ అక్క’ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఇటీవల జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు అందుకున్నామన్నారు.

News April 14, 2026

రాష్ట్రంలోనే అత్యధిక ఎండలు నల్గొండ జిల్లాలోనే

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో భానుడు భగభగలాడుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా గుడిపల్లి మండలం గన్‌పూర్‌లో 43.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అడవిదేవులపల్లిలో 43 డిగ్రీలు, కోదండపురంలో 42.9 డిగ్రీలు, గట్టుప్పల్‌లో 42.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉమ్మడి జిల్లాలోని 112 ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.