News March 12, 2025

అనకాపల్లి: 325 మంది విద్యార్థులు గైర్హాజరు

image

అనకాపల్లి జిల్లాలో బుధవారం జరిగిన ద్వితీయ సంవత్సరం ఇంటర్ పరీక్షకు 325 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్ బి.సుజాత ఒక ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 10,136 మంది హాజరుకావాల్సి ఉండగా 9,905 మంది హాజరైనట్లు తెలిపారు. వోకేషనల్ కోర్సుకు సంబంధించి 2,345 మంది హాజరు కావలసి ఉండటం 2,251 మంది హాజరైనట్లు తెలిపారు.

Similar News

News December 6, 2025

రిలేషన్‌షిప్‌లో ఈ తప్పులు చేస్తున్నారా?

image

దాంపత్య జీవితంలో చిన్న తప్పులు కూడా ఇద్దరి మధ్య దూరం పెంచేస్తాయని రిలేషన్‌షిప్ కౌన్సిలర్స్ హెచ్చరిస్తున్నారు. ‘మీ పార్ట్‌నర్ మాట్లాడేటప్పుడు పట్టనట్లు ఫోన్ చూసుకోకండి. చిన్న విషయాలకు కూడా కేకలు వేయకండి. ఏ చిన్న పనైనా మీ పార్ట్‌నర్‌తో డిస్కస్ చేయకుండా మొదలు పెట్టకండి. ఒకరి ఇష్టాన్ని ఒకరు గౌరవించుకోవాలి. ఏ రోజు డిఫరెన్సెస్‌ని ఆరోజే మాట్లాడుకుంటే లైఫ్ సాఫీగా సాగిపోతుంది’ అని సూచిస్తున్నారు.

News December 6, 2025

జగన్ క్షమాపణ చెప్పాలి: నాగరాజు

image

బలహీన వర్గాలకు చెందిన ఐపీఎస్ అధికారి గోపినాథ్ జెట్టిని, మాజీ సీనియర్ ఐఏఎస్ అధికారి కిష్ణయ్యను అగౌరవపరుస్తూ మాట్లాడిన వైఎస్ జగన్మెహన్ రెడ్డి వారిరువురికీ వెంటనే క్షమాపణ చెప్పాలని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. మీలా తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని వారు ఐపీఎస్, ఐఏఎస్ పోస్టులు సంపాదించలేదన్నారు.

News December 6, 2025

నేడు అమెరికాకు మంత్రి లోకేశ్

image

AP: పెట్టుబడుల సాధనే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ ఇవాళ్టి నుంచి 10వ తేదీ వరకు అమెరికా, కెనడా దేశాల్లో పర్యటించనున్నారు. తొలిరోజు డల్లాస్‌లోని తెలుగువారిని కలుస్తారు. 8, 9వ తేదీల్లో శాన్ ఫ్రాన్సిస్కోలో పలు కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతారు. 10న టొరెంటోలో పర్యటిస్తారు. ఈ 18 నెలల్లో లోకేశ్ అమెరికా వెళ్లడం రెండోసారి కావడం విశేషం. ఇప్పటివరకు US, దావోస్, సింగపూర్ ఆస్ట్రేలియా దేశాల్లో పర్యటించారు.