News March 15, 2025
అనకాపల్లి: 331 మంది విద్యార్థులు గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 331 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సుజాత ఓ ప్రకటనలో తెలిపారు. జనరల్ విద్యార్థులు 9,720 మంది హాజరు కావాల్సి ఉండగా 9,505 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు 1,932 మంది హాజరుకావాల్సి ఉండగా 1,816 మంది హాజరైనట్లు తెలిపారు.
Similar News
News March 16, 2025
రాయచోటి: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు. రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రానికి రావాలన్నారు.
News March 16, 2025
ఇష్టం లేని కోర్సులో విద్యార్థిని.. భరోసా ఇచ్చిన కేంద్రమంత్రి

తల్లిదండ్రుల ఒత్తిడితో ఇష్టమైన సైన్స్ కోర్సులో కాకుండా ఆర్ట్స్‌లో చేరినట్లు బిహార్‌కు చెందిన ఖుష్భూ ఓ ఇంటర్వ్యూలో కన్నీరుమున్నీరయ్యారు. ఇది కాస్త కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి చేరడంతో ఆమెకు కాల్ చేసి ధైర్యం చెప్పారు. సైన్స్ కోర్సులో చేరమని, డాక్టర్ కావాలనే కలను నెరవేర్చుకోవాలని తెలిపారు. కాగా టెన్త్ పరీక్షల్లో 500కు 399 మార్కులు రాగా పేదిరికం వల్ల ఆమె పేరెంట్స్ ఆర్ట్స్‌లో చేర్పించారు.
News March 16, 2025
శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.