News March 23, 2025
అనకాపల్లి: 4 ఎంపీపీ.. 2 వైస్ ఎంపీపీ ఎన్నికకు నోటిఫికేషన్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 27న 4 MPP, 2 వైస్ ఎంపీపీ, ఒక కో ఆప్షన్ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సీఈవో పి నారాయణమూర్తి శనివారం తెలిపారు. ఎన్నికలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీటీసీలు, కోఆప్షన్ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించినట్లు తెలిపారు. ఈనెల 27 ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట లోపు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ అనంతరం ఎన్నిక జరుగుతుందన్నారు.
Similar News
News December 13, 2025
రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.


