News March 30, 2024
అనకాపల్లి: 85 ఏళ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ హోమ్

ఓటింగ్ శాతం తగ్గరాదనే ముందు చూపుతో ఎన్నికల సంఘం 85 ఏళ్లు దాటిన వారికి, 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు ఓట్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించింది. అర్హులైన వారికి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు అందించి, వారితో ఓటు వేయించే బాధ్యత రిటర్నింగ్ అధికారి ఆదేశాలతో బీఎల్వోలే తీసుకుంటారని తెలిపింది. నోటిఫికేషన్ విడుదలైన ఐదు రోజుల్లో వాటిని భర్తీ చేసి బీఎల్వోలకు సమర్పించాలని నోడల్ అధికారి హేమంత్ తెలిపారు.
Similar News
News October 13, 2025
రేషన్ బియ్యం అక్రమాలకు చెక్: మంత్రి నాదెండ్ల

రేషన్ బియ్యం అక్రమాలకు చెక్ పెడుతున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇప్పటివరకూ 5.65 లక్షల క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నామని, 230 క్రిమినల్ కేసులు పెట్టామని తెలిపారు. విశాఖలో మూడు చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. స్పాట్లోనే రేషన్ బియ్యం గుర్తించేందుకు మొబైల్ కిట్స్ ఉపయోగిస్తున్నామని, ఎరుపు రంగులోకి మారితే రేషన్ బియంగా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు.
News October 13, 2025
విశాఖ: ప్రభుత్వ కార్యాలయాల్లో నేడు PGRS

విశాఖ కలెక్టరేట్లో ఈనెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదే విధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
News October 12, 2025
బాలికలకు క్రికెట్ మ్యాచ్ పాస్లు ఏర్పాటు చేసిన సీపీ

విశాఖలో ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్కు పలు స్వచ్చంధ సంస్థల్లో ఉంటున్న బాల బాలికలకు విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చి ప్రత్యేక పాస్లు ఏర్పాటు చేశారు. 11 ఆర్గనైజేషన్ల నుంచి సుమారు 300 మంది బాలికలకు పాస్లు ఏర్పాటు చేసి వారితో కలిసి సీపీ మ్యాచ్ విక్షించారు. ఈ అవకాశం కల్పించిన సీపీతో పిల్లలు ఫొటోలు దిగారు.