News February 23, 2025
అనకాపల్లి: TODAY TOP NEWS

*నర్సీపట్నంలో ఉచిత చికెన్ ఫ్రై, కోడిగుడ్లు పంపిణీ * అనకాపల్లి: ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ * మాడుగుల: వచ్చే నెల 14న పశువుల పాల పోటీలు *కళకళలాడుతున్న పెదబొడ్డేపల్లి ఫిష్ మార్కెట్ * మాకవరపాలెం ఎంపీడీవో ఇంటింటా ప్రచారం *జాతరను తలపించిన తుమ్మపాల చేపల బజార్ *కృష్ణదేవిపేట చేరుకున్న అల్లూరి శత వర్ధంతి జాతా *మయన్మార్‌లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు
Similar News
News November 2, 2025
గద్వాలలో అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

గద్వాల్ పట్టణం శేరెల్లి వీధికి చెందిన బలిజ లక్ష్మి అనే మహిళా అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. గద్వాల సీఐ శ్రీను, టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బలిజ లక్ష్మి, మల్లికార్జున్ ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. కాగా మృతురాలి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
News November 2, 2025
రేర్ ఎర్త్ మాగ్నెట్స్.. చైనాకు చెక్ పెట్టనున్న భారత్

రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిలో 90% వాటా కలిగిన చైనాకు సవాల్ విసిరేందుకు భారత్ సిద్ధమైంది. దేశీయంగా ఈ రంగంలో ప్రోత్సాహకాలను $290M నుంచి $788Mకు పెంచనున్నట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ రంగాలకు ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఎంతో కీలకం. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది.
News November 2, 2025
తుఫానుతో నష్టపోయిన నేతన్నలకు రూ.5వేలు: మంత్రి

AP: మొంథా తుఫానుతో నష్టపోయిన చేనేత కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి సవిత తెలిపారు. నీటమునిగి తడిచిపోయిన నూలు, రంగులు, రసాయనాలకు రూ.5 వేల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నామని చెప్పారు. వర్షాలతో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, లీటర్ పామాయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, కేజీ పంచదార ఇస్తున్నట్లు పేర్కొన్నారు.


