News December 16, 2024

అనపర్తిలో రైలు ఢీకొని యువకుడు మృతి

image

అనపర్తిలో రైలు ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు..అనపర్తికి చెందిన కే. పవన్ (25) ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. సోమవారం సాయంత్రం పని నిమిత్తం ఇంటి నుంచి రెస్టారెంట్‌కి బయలుదేరాడు. మార్గమధ్యలో రైలు పట్టాలు దాటుతుండగా వైజాగ్ వైపు వెళ్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

రేపు రాజమండ్రిలో ఉద్యోగమేళా

image

మెప్మా, నిపుణ హ్యూమన్ డెవలప్‌మెంట్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 9న (ఆదివారం) రాజమండ్రి సుబ్రమణ్య మైదానంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనక రాజు శనివారం తెలిపారు. విభిన్న రంగాలకు చెందిన 15కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని వెల్లడించారు. టెన్త్ నుంచి పీజీ, బీటెక్, నర్సింగ్ చేసిన వారు ఈ మేళాను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

ఈనెల 10న యథాతధంగా పీజీఆర్ఎస్‌: కలెక్టర్

image

పీజీఆర్ఎస్‌ కార్యక్రమం ఈనెల 10 సోమవారం యథాతధంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వ్యయప్రయాసలకు గురి కాకుండా తమ డివిజన్‌, మండల కేంద్రాలు, గ్రామ-వార్డు సచివాలయాల్లోనే అర్జీలు సమర్పించి పరిష్కారం పొందాలని సూచించారు. అలాగే 1100 టోల్‌ఫ్రీ నంబర్‌ లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

News November 8, 2025

రాజమండ్రి: తుఫాను పంట నష్టం అంచనాలు పూర్తి

image

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టం అంచనా ప్రక్రియ పూర్తయినట్లు డీఏఓ మాధవరావు శుక్రవారం వెల్లడించారు. మొత్తం 14,602 హెక్టార్లలో వరి, 1,135 హెక్టార్లలో మినుము పంటకు నష్టం వాటిల్లిందని తెలిపారు. వరికి ఎకరాకు రూ.25 వేలు, మినుముకు ఎకరాకు రూ.15 వేలు చొప్పున మొత్తం రూ.38 కోట్లకు పైగా పరిహారాన్ని రైతులకు చెల్లించనున్నట్లు ఆయన వివరించారు.