News March 10, 2025
అనాతవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ముమ్మిడివరం మండలం అనాతవరం సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ఆబోతును ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. వెనక కూర్చున్న వ్యక్తికి గాయాలయ్యాయి. కాకినాడ నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 10, 2025
ఉద్యోగులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

ఐగాట్ కర్మయోగి ద్వారా ఉద్యోగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని నంద్యాల కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ఐగాట్ కర్మయోగి యాప్, పి4 సర్వేలపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News March 10, 2025
ICC ఛాంపియన్స్ ట్రోఫీ టీం.. రోహిత్‌కు దక్కని చోటు

CT-2025 టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ICC ప్రకటించింది. ఇందులో భారత్ నుంచి ఆరుగురికి చోటు దక్కింది. కెప్టెన్‌గా సాంట్నర్(NZ)ను తీసుకుంది. IND నుంచి కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, షమీ, వరుణ్, అక్షర్ పటేల్(12వ ప్లేయర్)లకు చోటిచ్చింది. రచిన్, ఇబ్రహీం, ఫిలిప్స్, అజ్మతుల్లా, హెన్రీలను మిగతా సభ్యులుగా చేర్చింది. అయితే తన కెప్టెన్సీతో INDను ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.
News March 10, 2025
అర్జీల పరిష్కారంలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్‌కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. సోమవారం విజయవాడలోని కలెక్టరేట్లో ఆయన అధికారులతో కలిసి ప్రజల నుంచి 152 అర్జీలు స్వీకరించారు. అధికారులు అర్జీదారునితో నేరుగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు.