News August 30, 2024
అనాథ బాలికను బడిలో చేర్పించిన నిర్మల్ కలెక్టర్

ఇటీవల తానూర్ మండలం బెళ్తారోడా గ్రామానికి చెందిన దుర్గ తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం బాలికను నిర్మల్ పట్టణంలోని పాఠశాలలో చేర్పించి, బాలిక చదువుకోవడానికి అవసరమైన వస్తువులను కొనిచ్చారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని బాలికకు సూచించారు. ఇందులో ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News February 15, 2025
నిర్మల్: విద్యార్థిని ఆత్మహత్య

HYD పోచారం IT కారిడార్ PS పరిధిలో నిర్మల్ జిల్లాకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బామ్ని గ్రామానికి చెందిన అంకిత(21) ఎస్సీ కార్పొరేషన్‌లో ఉచిత కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకుంటోంది. శుక్రవారం హాస్టల్‌లోని గదిలో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 15, 2025
ఆదిలాబాద్: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ ఎక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
News February 15, 2025
ADB: యువకుడిపై అడవి పంది దాడి

ఆదిలాబాద్ జిల్లా సోనాల మండల కేంద్ర శివారు ప్రాంతంలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర శనివారం ఉదయం విష్ణు అనే యువకుడి పై అడవి పంది దాడి చేసి గాయపరిచింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పెట్రోల్ బంక్ నుంచి సొనాల వైపు వెళుతుండగా బ్రిడ్జి దగ్గర ఉన్న అడవి పంది ఒక్కసారి పైకి వచ్చి దాడి చేసింది. దానిని ప్రతిఘటిస్తూ కేకలు వేయడంతో పారిపోయిందన్నారు. తృటిలో ప్రాణాపాయం తప్పిందన్నారు.