News June 29, 2024
అనారోగ్యంతో డిప్యూటీ MRO ఆత్మహత్య

అనారోగ్యంతో ఓ డిప్యూటీ MRO ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాలి మండలంలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నీలంపేటకు చెందిన ఆర్.శ్రీనివాస్ రావు పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తూ శ్రీకాకుళంలోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 8, 2025
బాల్యవివాహాలు నిర్మూలన మనందరి బాధ్యత: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలన మనందరి బాధ్యతని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంబంధిత వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా ముందుకు నడిపించేందుకు అందరి వంతు కృషి అవసరం అన్నారు. బాల్యవివాహాల వలన ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి అని ఆయన తెలియజేశారు. జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.
News December 8, 2025
శ్రీకాకుళం: ‘ధాన్యాన్ని అధనంగా తీసుకుంటున్నారు’

ధాన్యం కొనుగోళ్లలో కొనుగోలు కేంద్రాల వద్ద 3 నుంచి 5 కేజీలు అధనంగా రైతుల నుంచి మిల్లర్లు తీసుకుంటున్నారని ఏపీ రైతు సంఘం పీజీఆర్ఎస్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు వినతి పత్రం అందజేశారు. నిబంధనల ప్రకారం కొనుగోలు చేయాలని ప్రసాదరావు, చందర్రావు అన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అధికారులు అమలు చేయాలని కోరారు.
News December 8, 2025
9 వరకు టెన్త్ ఫీజు చెల్లింపు గడువు పెంపు SKLM DEO

ఎటువంటి అపరాదరుసుం లేకుండా డిసెంబర్ 9 వరకు టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు సోమవారం తెలిపారు. రూ.50 ఫైన్‌తో 10 నుంచి 12 వరకు, రూ.200 ఫైన్‌తో 13 నుంచి 15 వరకు, రూ.500 ఫైన్‌తో 16 నుంచి 18వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. సంబంధిత పాఠశాలల హెచ్ఎంలకు సమాచారం తెలియజేశామన్నారు.


