News March 3, 2025
అనారోగ్య కారణాల వల్లే ముగ్గురూ మృతి: కలెక్టర్

ఆత్మకూరులో మరణించిన ముగ్గురు అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని, కలుషిత నీటి వల్ల కాదని కలెక్టర్ జీ.రాజకుమారి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి రోగులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి కలుషితం లేదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Similar News
News December 10, 2025
WGL: రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు..!

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో మద్యం పర్వం జోరందుకుంది. కుల, యువజన సంఘాల మద్దతు కోసం అభ్యర్థులు బ్రాండెడ్ మద్యంతో పాటు నాన్వెజ్ భోజనాలతో దావత్లు ఇస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.లక్ష, పెద్ద గ్రామాల్లో రూ.5 లక్షల వరకు మద్యం ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు. పోటీ ఎక్కువైతే ఈ వ్యయం రూ.20 లక్షలకు చేరుతోంది. ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం రూ.60-100 కోట్ల వరకు మద్యం ఖర్చు అయ్యే వీలున్నట్లు అంచనా.
News December 10, 2025
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

<
News December 10, 2025
నానో ఎరువులను ఎలా వాడాలి?

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.


