News March 3, 2025
అనారోగ్య కారణాల వల్లే ముగ్గురూ మృతి: కలెక్టర్

ఆత్మకూరులో మరణించిన ముగ్గురు అనారోగ్య కారణాల వల్లే మృతి చెందారని, కలుషిత నీటి వల్ల కాదని కలెక్టర్ జీ.రాజకుమారి స్పష్టం చేశారు. ఆదివారం పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి రోగులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి కలుషితం లేదని పేర్కొన్నారు. వైద్య సిబ్బంది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Similar News
News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.
News March 24, 2025
బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.
News March 24, 2025
తాడేపల్లిలో పామర్రు మహిళ దారుణ హత్య

ఎన్టీఆర్ జిల్లా తాడేపల్లి కొలనుకొండ వద్ద ఆదివారం రాత్రి నిర్మానుష్య ప్రాంతంలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసినదే. మృతురాలు కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన సజ్జా లక్ష్మీ తిరుపతమ్మగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త మృతి చెందడంతో కుటుంబ పోషణ భారమై క్యాటరింగ్ పనులకు వెళ్తోంది. లక్షీ తిరుపతమ్మ ఆదివారం విజయవాడలో క్యాటరింగ్ పనికి వెళ్తున్న క్రమంలో హత్యకు గురైంది.