News June 13, 2024
అనితకు మంత్రి పదవిపై కొణతాల స్పందన

పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు మంత్రి పదవి దక్కడంపై అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ స్పందించారు. అనకాపల్లిలో ఆయన మాట్లాడుతూ.. కష్ట కాలంలో పార్టీకి సేవలు అందించిన అనితకు మంత్రి రావడంపై స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రజల కలలను సాకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే విధంగా పాలన సాగుతుందన్నారు.
Similar News
News November 5, 2025
విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
News November 5, 2025
గాజువాక: ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు కాజేశారు

గాజువాకలో భార్యాభర్తలిద్దరినీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. చట్టివాణిపాలేనికి చెందిన అలేఖ్య నర్సింగ్ చదువుతుండగా.. భర్త వినాయకరావు బీటెక్ చదివాడు. ఇద్దరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని మల్కాపురానికి చెందిన మచ్చ సజిని, నారాయణ రూ.91 లక్షలు కొట్టేశారు. వీరికి శ్రీహరిపురానికి చెందిన సీరపు షణ్ముఖ ఆదిత్య కుమార్, సీరపు రాంప్రసాద్, సీరపు అనిత సహకరించారు.
News November 5, 2025
ఆరిలోవ రైతు బజార్లో స్టాళ్ల కేటాయింపునకు డ్రా

ఆరిలోవ రైతు బజార్లో ఖాళీగా ఉన్న స్టాళ్ల కేటాయింపు పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని జేసీ మయూర్ అశోక్ తెలిపారు. అక్టోబర్ 22న డ్రా ద్వారా 50 మంది రైతులకు స్టాళ్లు కేటాయించగా.. నేడు డ్వాక్రా సభ్యుల కోసం 10 స్టాళ్లు, వికలాంగుల కోసం ఒక స్టాల్ కేటాయించనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించి తుది కేటాయింపులు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు


