News February 11, 2025
అనుమతి లేకుండా ధర్నా, రాస్తారోకోలు నిషేధం: ఎస్పీ

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అనుమతి లేకుండా ఎవరైనా ధర్నా, రాస్తారోకో, నిరసనలు చేయడం నిషేధమని జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సోమవారం తెలిపారు. ఎవరైనా అలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటే రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతి తీసుకున్న వారు ప్రజా మరియు ప్రభుత్వ ఆస్తులకు, కార్యకలాపాలకు ఎలాంటి నష్టం జరగకుండా నిరసన కార్యక్రమం చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 8, 2026
కామారెడ్డి: మహిళా దినోత్సవం రోజు దారుణం

మహిళల గౌరవం గురించి ప్రపంచం మాట్లాడుకునే మహిళా దినోత్సవం రోజునే కామారెడ్డిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన ముగ్గురు చిన్నారి కూతుళ్లను చెరువులో పడేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన తండ్రి చేతిలోనే వారి ప్రాణాలు కోల్పోవడం సమాజాన్ని కలచివేసింది. ఆడపిల్లల భద్రత, విలువపై సమాజం మరింతగా ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తు చేస్తోంది.
News March 8, 2026
శ్రీకాకుళం: ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలకు వేళాయె!

మెరుగైన ఇంగ్లిష్ మీడియం విద్యకు చిరునామాగా మారిన ఏపీ మోడల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల అయింది. శ్రీకాకుళం జిల్లాలో 13 మోడల్ స్కూల్స్ ఉండగా, ఒక్క స్కూల్‌లో 100 సీట్లకు ప్రవేశాలుంటాయి. జిల్లాలో 1300 సీట్లు ఉన్నాయి. ఆన్లైన్లో ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఏప్రిల్ 12న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
News March 8, 2026
ఏలూరు: కిడ్నాప్ కలకలం.. రక్షించిన పోలీసులు

చింతలపూడి మండలం వెలగలపల్లిలో శనివారం మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. గ్రామానికి చెందిన కర్రీ నాగసత్య వరలక్ష్మిని వ్యక్తిగత కక్షలు, అనుమానాలతో గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే వరలక్ష్మి ఆచూకీని కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


