News March 22, 2024

అనుమతులు తప్పనిసరి: ఏలూరు ఎస్పీ

image

ఎన్నికల కోడ్, సెక్షన్ 144 సీఆర్పీ అమలులో ఉన్నందున ఏవైనా ప్రచార కార్యక్రమాలు, రోడ్ షోలు, సభలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సువిధ యాప్‌లో పూర్తి సమాచారంతో ముందుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు సభలు, సమావేశాలు, ప్రదర్శనలకు అనుమతించమని తెలిపారు.

Similar News

News November 24, 2025

ప.గో. జిల్లాలో 7 ఇసుక స్టాక్ పాయింట్స్: కలెక్టర్

image

జిల్లాలో పెద్దఎత్తున 7 ఇసుక నిల్వల స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఇంజనీరింగ్ సిబ్బంది ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు స్టాక్ పాయింట్ల నుంచి ఇసుకను తీసుకోవాలన్నారు. తల్లికి వందనం సంబంధించి పెండింగ్‌లో ఉన్న 1,465 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. జేసీ రాహుల్, డీఆర్ఓ శివన్నారాయణరెడ్డి ఉన్నారు.

News November 24, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో ఇల్లు రీసర్వే, తల్లికి వందనం, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తదితరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని సూచించారు. త్రాగునీరు సమస్య లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News November 24, 2025

భీమవరం: మానసిక రోగుల గుర్తింపుపై పోస్టర్‌ ఆవిష్కరణ

image

మానసిక రోగుల గుర్తింపు, చికిత్స, పునరావాసం కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మనోబంధు ఫౌండేషన్ రూపొందించిన పోస్టర్‌ను ఎస్పీ నయీం అస్మి ఆవిష్కరించారు. సోమవారం ప.గో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సమాజంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవడం అభినందనీయమన్నారు.